నవంబర్-20-2008

"నువ్వు నా దానివి కాదు !" అనే ఓ వికృతమైన నిజం ఓ అందమైన అబద్ధం అయిపోవాలని అనుక్షణం పరితపిస్తున్నా . . "
నా ప్రాణంగా, నా ప్రపంచంగా భావించిన నిన్ను నేను కోల్పోతున్నాననే నిజాన్ని విని ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు "చిన్ను"!. నా వాకిలిలో రంగవల్లికలు వేసే రాణివి ..., నువ్వు నా మనస్సులో కరిగిపోయే జాబిల్లివి కాదన్న విషయం ఎలా మరచిపొమ్మంటావు చెప్పు ! మవ్వలా మనసులో సందడి చేస్తావనుకుంటే కట్టిన గుడిని వదిలేసి గగనంలో రివ్వున ఎగిరిపోతే ఎలా నేస్తం ?

"నువ్వు నమ్మలేకపోయినా ఇది నిజమేరా !" అంటూ ప్రతి నిమిషం నా పిచ్చి మనసు పదే పదే గుర్తు చేస్తుంది.



ఎన్నెన్నో రంగుల కలల్లో విహరించిన నాకు ఇప్పుడు ఆ రంగుల హరివిల్లు కారుమబ్బులా మసకబోయింది. అందుకేనేమో ఈ క్షణం అంధకారంతో ఆవహించింది.
ఒక్క విషయంలో మాత్రం నాకు నిజంగా ఈర్షగా ఉంది. నీకోసం వేచిచూడకపోయినా, నినిషానికి నాలుగువేలసార్లు నిన్ను తలచుకోకపోయినా, నిన్నే స్మరిస్తూ నిద్రలేని రాత్రులెన్నో గడపకపోయినా, నాలా నిన్ను ఇష్టపడకపోయినా, నాలా నిన్ను అభిమానించకపోయినా, నాలా నిన్ను ఆరాధించకపోయినా, ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించకపోయినా....
నిన్నటివరకూ నీతో ముఖపరిచయం కూడా లేని ఓ వ్యక్తి నిన్ను సొంతం చేసుకోబోతున్నాడని తెలిసి అతని అదృష్టాన్ని చూడలేక నా మనస్సు నిజంగా ఈర్శ్య పడుతుంది.


నేను ఓడిపోతానని తెలిసినా నా మనస్సు నీ మనస్సుని గెలుచుకోవాలని అనుక్షణం ఎంతో పోరాడింది. ఆరాటపడింది! కానీ ఫలితం మాత్రం ప్రతికూలమయింది. నిన్ను కోల్పోతున్నానని భాదపడుతున్నా... నా ఓటమిలో ఏదో తెలియని చిన్న సంతోషం! ఓ పక్క చిన్న గర్వం కూడా! బహుశా నాకూ స్పందించే హృదయం ఉందని మొదటిసారి తెలిసినందుకేమో!!!


ఓ తియ్యని జ్ఞాపకంలా మిగిలిపోతావో... జాబిలిలా జీవితాంతం వెంటపడతావో తెలియదుగాని....! ఓ విషయం మాత్రం మనస్శాక్షిగా, మనస్పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. అది...........



I LOVE YOU MY SWEET HEART

&

I MISS YOU

No comments:

Post a Comment