జనవరి-04-2010



నీకోసం ఆరు సంవత్సరాలు నిన్ను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీకోసం ఆలోచించని రోజు లేదు. నువ్వు నాకు దూరమయ్యాక భాదపడని రోజు లేదు. నిన్ను ఎంతగా ప్రేమించానంటే? నా జీవితంలో భార్య అనే స్తానామంటూ ఉంటే అది నీది మాత్రమే.

ఎప్పటికీ నిన్ను చూస్తూ ఉండిపోవాలని, నీతోనే కలిసుండాలని, నీతోనే జీవితాన్ని గడపాలని ఆశించాను.


నిన్ను చూడగానే ఎంతో మురిసిపోయే నన్ను ఆ సంతోషాన్ని దూరం చేసి వేరోకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. ఆ చిన్న,చిన్న సంతోషాలని కూడా నాకు దూరం చేశావు. నిన్నే తలచుకుంటూ రోజంతా హాయిగా గడిపేవాన్ని. ఇప్పుడు ప్రతి రోజూ నువ్వు నాకు దూరమయ్యావనే భాదని మిగిల్చావు.

రజిని, నువ్వు ఎక్కడున్నా జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను.




your's ......
Dileep Kumar