జూన్-12-2007
నాకు ఆగస్ట్-15-2004 న రజిని కనబడింది. ఆమెను చూడగానే నాకు ఆమెపై ఏదో తెలియని మనోభావన ఏర్పడింది. మొట్టమొదటిసారి ఆమె కళ్ళల్లోకి చూడగానే నా హృదయం స్పందించింది. ఆమెనే చూస్తూ ఉండిపోవాలనిపించింది.
నిజంగా రజిని ని చూసినప్పుడు హలిగిన భావన వేరే ఏ అమ్మాయిని చూసినప్పుడు కలగలేదు. ఆ అనుభూతిని మాటల్లో కూడా వర్ణించలేను. అది ఒక కొత్త సమయం. ఒక కొత్త సంతోషం, కొత్త ఆనందం. అదేమిటో తెలియని అనుభూతి, విచిత్రమైన ఆలోచనలు. మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఆ క్షణాల్ని, ఆ ఆలోచనలను, ఆ ఆనందాన్ని నా జీవితంలో మర్చిపోలేను.
రజినినే ఎందుకు ప్రేమించానంటే... ఆమె అందం కూడా కారణం కావచ్చు, కాకపోవచ్చు, నాకు తెలీదు. కాదని మాత్రం కశ్చితంగా చెప్పలేను, అలాగని ఆమె అందం మాత్రమే కారణం అని చెప్పను. ఎందుకంటే రజిని ని చూడకముందు రజిని కన్నా అందమైన వారిని చాలా మందిని చూశాను. కానీ రజిని ని చూసినప్పుడు కలిగిన భావన వేరే ఏ అమ్మాయిని చూసినప్పుడు కలగలేదు.
చిన్ను ఆగస్ట్-15 కంటే ముందు కూడా స్కూల్లో ఒకటి,రెండు సార్లు కనిపించింది. మరి అప్పుడు అలాంటి భావన ఎందుకు కలగలేదు అని నాకు అనిపించింది.
ఎందుకంటే... నాకు ఒక అమ్మాయిని ప్రేమించే ఆలోచనలు గానీ, కోరికలు గానీ, ఆ వయస్సులో లేవు కావచ్చు. చిన్నుని చూసిన తరువాత కూడా ఆలోచించాను. ఒకవేళ నాకు రజిని పై కలిగిన మనోభావన ఆకర్షణ కావచ్చు అనుకున్నాను. కానీ చిన్ను పై నాకున్నది ఆకర్షనే అయితే ఆ ఆకర్షణ ఇన్ని రోజులు ఉండదు. ఆమెను చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతి ప్రేమో,కాదో కూడా నాకు అప్పుడు తెలియలేదు. కానీ కొద్ది సమయంనే తెలిసింది, ఆమెపై నాకు కలిగిన అనుభూతి, భావన, ఆలోచన, అభిప్రాయం ఖశ్చితంగా ప్రేమే. అవును నిజంగా నాది నిజమైన ప్రేమ.
నాకు చిన్ను గురించి తెలిసింది చాలా తక్కువ. ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు, అభిరుచులు, ఆమె మనసు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు.
మరొక విషయం... నేను రజిని నే ప్రేమించడానికి సెక్స్ అనే భావన ఎంత మాత్రం కాదు. నాకు ఇప్పటివరకూ ఆమెపై అలాంటి ఆలోచన కలగలేదు. నా విషయంలో సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతే కానీ అదే జీవితం కాదు.
ఇద్దరి జీవితాలలో సెక్స్ అనేది అవసరం కావచ్చు, కాకపోవచ్చు. కానీ వారి జీవితాలలో సెక్స్ తో పాటు ఎన్నో అభిరుచులు, ఆనందాలు, అభిప్రాయాలు, ఉంటాయి. వారు చనిపోయే వరకు వారి జీవితాంతం ఆనందంగా, సంతోషంగా వారి జీవనాన్ని గడపాలి.
ఒకవేళ నాకు ఆమెపై అలాంటి ఉద్దేశ్యమే ఉంటే నాకు ఆ అమ్మాయే అవసరం లేదు. నాకు పెళ్లైతే ఏ అమ్మాయి అయినా నాకు భార్యగా వస్తుంది. ఆమెతో కూడా నాకు సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి నాకు రజిని పై అలాంటి ఉద్దేశ్యం లేదు.
నేను రజిని తో జీవితాంతం నా ఆనందాలని, సంతోషాలని, ఆప్యాయతలని, కష్టాలని, సుఖాలని పంచుకోవాలి. అప్పుడప్పుడూ వచ్చే కోపాలు, భాదలు, చిన్న,చిన్న పొరపాట్లు, సర్దుకుపోయే అలవాట్లు, పండగలు, ఆనందాలు, కానుకలు, ఆప్యాయతలు, ప్రేమలు, కర్తవ్యాలు, ఉద్యోగం, డబ్బు, ఖర్చులు, లాభాలు, నష్టాలు, బంధువులు, స్నేహితులు, మరచిపోలేని రోజులు. ఇలా ఎన్నో మా ఇద్దరి జీవితంలో రావాలి. ఇద్దరం కలిసి జీవితాంతం జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, గడపాలి. ఇలా ఎన్నో మా ఇద్దరి జీవితంలో రావాలి, వాటిని ఆస్వాదించాలి. మేమిద్దరం కలిసి అలాంటి జీవితం గడపాలి. అంతే. నేను చిన్ను నుండి కోరుకునేది ఇలాంటి జీవితమే.
I Love You Chinnu
Subscribe to:
Posts (Atom)

nice
ReplyDelete