ఫిబ్రవరి-19-2008

ఇప్పుడు చిన్ను చదవడం లేదు. కాబట్టి ఈ మూడు సంవత్సరాలలో చిన్నుకి పెళ్లి చేస్తారు అనుకుంటున్నాను.

M.C.A చేసి మంచి ఉద్యోగం చేయాలి. ఈ మూడు సంవత్సరాలలో లేదా నాకు ఉద్యోగం వచ్చిన తరువాత నా మనస్సు మారి వేరోక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేదా రజిని ని మర్చిపోలేక, ఎవరినీ ఇష్టపడక నేను పెళ్లి చేసుకోకపోయినా మా అమ్మ,అన్నయ్య లతో నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను.


జీవితంలో చిన్ను ప్రేమని పొందలేకపోయినా అమ్మ, అన్నయ్య, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలతో నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను. ఒకవేళ నిజంగా నువ్వు నాకు దూరమైనా కొంతకాలం భాదపడుతుండవచ్చు.అలాగని జీవితాంతం ఏదో కోల్పోయానని జీవిస్తూ గడపడం నాకు ఇష్టం లేదు.



చిన్ను నాకు దూరమయిందని భాదపడను. ఆమె ప్రేమ నాకు లభించలేదని నా జీవితాన్ని నిరాశ చేసుకోలేను. కానీ ఆమె ప్రేమను పొందలేకపోవడం నా జీవితానికి ఒక నిరాశ. రజిని కూడా నాతో ఉంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.



ప్రతీ ఒక్కరూ పెళ్లి చేసుకొనే జీవితాన్ని గడపాలని నా ఉద్దేశ్యం కాదు. ఎలాంటి కష్టాలు లేకుండా అందరి ప్రేమను పొందుతూ, అందరికీ ప్రేమానురాగాలు పంచుతూ నా జీవితాన్ని మాత్రం సంతోషంగా గడుపుతాను.



ఇంతకు ముందు నాలో ఒక భావన ఉండేది. చిన్ను నాకు దూరమైతే ఆనందంగా ఉండగలనా అని... కానీ ఆమె ప్రేమ ఒక్కటే నా జీవితం కాదు. నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్న అమ్మ, నా కోసం ఏదైనా చేసే అన్నయ్య, వారు నాపై పెట్టుకున్న ఆశలు, ఆశయాలు, నీను జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే వారి తపన ముందు నా ప్రేమ గొప్పది కాదు.


భవిష్యత్తులో రజిని ప్రేమ లభించినా, ఆమె నానుండి దూరమైనా నాకు వాళ్ళున్నారు. నాకు కూడా చిన్ను ప్రేమకంటే ముందు అమ్మ, అన్నయ్య ల ప్రేమ కావాలి. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడమే నా కర్తవ్యం.


i miss you chinnu